గుంటూరులో కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడ్డ కేసులో నిందితుల అరెస్టు
- ధరణికోటలో ఓ వ్యక్తిని బెదిరించిన కేసు పురోగతి
- పంట భూమిని తన పేరిట రాయించుకున్న నిందితుడు
- బాధితులను దారుణంగా హింసించారు
ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, కిడ్నాప్ నకు గురైన వారిని నిందితులు దారుణంగా హింసించారని, ఈ నిందితుల్లో బాచి అనే కానిస్టేబుల్ కూడా వున్నాడని చెప్పారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నాప్ చేశారని, ఈ కేసుకు సంబంధించి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సైతం నిందితులు బెదిరించారని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని భయపెట్టారని చెప్పారు.