కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేస్తున్నాను: శంషాబాద్ ఘటనపై మరోసారి స్పందించిన సినీనటుడు మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేస్తున్నాను: శంషాబాద్ ఘటనపై మరోసారి స్పందించిన సినీనటుడు మహేశ్ బాబు

  • రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి
  • సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదు
  • మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది
శంషాబాద్ లో వైద్యురాలి హత్యాచారంపై ఇప్పటికే సినీనటుడు మహేశ్ బాబు ఓ కవిత రూపంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ లో మరోసారి స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయని, సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదని, ఉన్నత విలువలను సాధించడంలో విఫలమవుతున్నామని ట్వీట్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేస్తున్నానని తెలిపారు. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు.

బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరం కలిసి మహిళలకు అండగా నిలుద్దామని, దేశాన్ని సురక్షితంగా మార్చుదామని మహేశ్‌ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు పీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.


Mahesh Babu
Crime News
Tollywood

More Telugu News