Vijay Sai Reddy: అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు జగన్ తపిస్తున్నారు: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తమను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం తపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ ఆరు నెలల పాలనపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించి, ఈ కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.

'నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఏపీ సీఎం గారు నిరంతరం తపిస్తున్నారు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
Vijay Sai Reddy
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News