సముద్ర తీరానికి నష్టం జరగకుండా విశాఖలో మెట్రో రైల్ విస్తరణ: బొత్స
- మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించిన మంత్రుల బృందం
- అధికారులతో బొత్స, అవంతి సమీక్ష
- త్వరలోనే టెండర్లు
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, విశాఖ సముద్ర తీరానికి ఎలాంటి నష్టం జరగకుండా మెట్రో రైలు ప్రాజక్టు విస్తరణ ఉంటుందని తెలిపారు. దశల వారీగా జరిగే ఈ విస్తరణ కార్యక్రమంలో తొలి విడతలో 47 కిమీ మేర మెట్రో నిర్మాణం జరుపుతామని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ ఉంటుందని, మెట్రో ప్రాజెక్టు పనుల్లో పీపీపీ విధానం అమలు చేస్తామని చెప్పారు.