ఏపీలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదు: పంచుమర్తి అనురాధ
- ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది
- నిందితుల్లో ఎక్కువమంది వైసీపీ అనుకూలురేనంటూ ఆరోపణ
- ఏపీ సర్కారుపై విమర్శలు
ఈ అత్యాచార కేసుల్లో ఎక్కువ శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లే ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్నా ఈ దారుణాలపై స్పందించరని అనురాధ మండిపడ్డారు. గతంలో తాము ఓ అత్యాచార బాలికకు సాయం చేసేందుకు ఆసుపత్రికి వెళదామని అనుకుంటే, బాధిత చిన్నారిని హడావుడిగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారని ఆరోపించారు. నిందితుడు నరేంద్రరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.