ప్రియాంక రెడ్డి కేసు నిందితుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది: వైద్యులు
- పోలీస్ స్టేషన్ లోనే నిందితులకు ఆరోగ్య పరీక్షలు
- వివరాలు తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్
- ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు
వారిని షాద్ నగర్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీస్ స్టేషన్ బయట అనుకూల వాతావరణం లేకపోవడంతో వైద్యులనే పోలీసులు ఆసుపత్రికి పిలిపించారు. పోలీస్ స్టేషన్ లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, జడ్జీలు అందుబాటులో లేకపోవడంతో నిందితులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి.. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.