Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గీతాంజలి'తో స్టార్ డమ్ వచ్చినా గిరిజ సైకిల్ పైనే తిరిగేదట!

  • గిరిజ గారు చాలా సింపుల్ గా ఉండేవారు 
  • హఠాత్తుగా మా ఇంటికి వచ్చేశారు 
  • కాలనీ అంతా కదిలివచ్చేసిందన్న ఈశ్వర్
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ ..'గీతాంజలి' సినిమాతో గిరిజకి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ సమయంలోనే ఆమె మా సినిమా 'హృదయాంజలి' చేశారు. తనకి వచ్చిన స్టార్ డమ్ ను ఆమె పట్టించుకునేవారు కాదు. తన ఇంటి నుంచి ఆమె మా ఆఫీస్ కి సైకిల్ పై వచ్చేవారు. 'గీతాంజలి' గిరిజ అంటూ చాలామంది ఫాలో అవుతూ ఉండేవారు. అది చూసి అలా సైకిల్ పై తిరగవద్దని మేము చెప్పాము.

ఒక రోజున ఆమె మా ఇంటి అడ్రెస్ అడిగితే ఇచ్చాను .. మరునాడు ఉదయమే ఆమె మా ఇంటికి వచ్చేశారు. అప్పట్లో మాది చాలా ఇరుకైన ఇల్లు .. అయినా అందరినీ పరిచయం చేసి ఆమెకి అతిథి మర్యాదలు చేశాను. 'గీతాంజలి' గిరిజ మా ఇంటికి వచ్చిందని తెలిసి కాలనీలోని వాళ్లంతా రావడం మొదలుపెట్టారు. గుంపులుగా జనం పెరిగిపోతూ ఉండటంతో, నాలో టెన్షన్ మొదలైంది. ఆటో మాట్లాడేసి ఆమెను పంపించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.
Girija
Eeshwar

More Telugu News