క్యాన్సర్ బాధితురాలు స్వప్నతో 'రూలర్' చిత్రం విశేషాలను పంచుకున్న బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాన్సర్ బాధితురాలు స్వప్నతో 'రూలర్' చిత్రం విశేషాలను పంచుకున్న బాలకృష్ణ

  • బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న స్వప్న
  • బసవతారకం ఆసుపత్రిలో ఆమెను పరామర్శించిన బాలయ్య
  • అన్ని విధాలా ఆదుకుంటానంటూ హామీ
తనను ఎంతో అభిమానించే అభిమానులపై బాలయ్య ఎంతటి ప్రేమాభిమానాలను చూపిస్తారో అందరికీ తెలిసిందే. అభిమానుల కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన స్వప్న అనే అమ్మాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతోందని తెలిసి ఆయన చలించిపోయారు. తనను చూడాలనుకుంటున్న ఆమె కోరిక మేరకు ఆసుపత్రిలో ఉన్న ఆమెను కలిసి, పరామర్శించారు. అనంతరం తన ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఆమెను చేర్పించారు.

బసవతారం ఆసుపత్రికి వచ్చిన బాలయ్య స్వప్నతో మాట్లాడారు. నేనున్నానంటూ ఆమెకు భరోసా ఇచ్చారు. తన కొత్త చిత్రం 'రూలర్'కు సంబంధించిన విషయాలను ఆమెతో పంచుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. స్వప్నను అన్ని విధాలా ఆదుకుంటానని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు. ఆమెకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని చెప్పారు.
Balakrishna
Swapna
Tollywood

More Telugu News