'నిన్నుకోరి' దర్శకుడితోనే మళ్లీ సెట్స్ పైకి నాని
- నానీకి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ
- శివపై నమ్మకంతో మళ్లీ ఛాన్స్ ఇచ్చిన నాని
- విజయ్ దేవరకొండను కూడా లైన్లో పెట్టిన శివ
ఈ సినిమాను రేపు లాంచ్ చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇటు విజయ్ దేవరకొండకి కూడా శివ నిర్వాణ ఒక కథను వినిపించాడు .. ఆ కథ కూడా ఓకే అయింది. అయితే విజయ్ దేవరకొండ వరుస కమిట్మెంట్స్ తో వున్నాడు. అందువలన ముందుగా నానితో చేయడానికి శివ నిర్వాణ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత రావలసి వుంది.