యూనియన్లు ఉండాలా? వద్దా? అన్నదానిపై కార్మికులతో రిఫరెండం నిర్వహించండి: అశ్వత్థామరెడ్డి
- కొన్ని దశాబ్దాలుగా ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి
- కార్మిక సంఘాలు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాయి
- కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడం తగని చర్య
అవసరమొస్తే యూనియన్ల నేతలమందరం విధుల్లోకి వెళతామని...కార్మికులతో రిఫరెండం పెట్టి యూనియన్లు ఉండాలా? వద్దా? అన్నది తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ట్రేడ్ యూనియన్లున్నాయన్నారు. కార్మిక సంఘాలతో పాటు పలు సంఘాలు తెలంగాణ పోరాటంలో ముందునడిచాయని చెప్పారు. చట్ట ప్రకారం కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులుంటాయన్నారు. కార్మిక సంఘాలకు కల్పించే డ్యూటీ మినహాయింపుపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని అభ్యర్థించారు.
‘కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవు. అవసరమొస్తే యూనియన్ల నేతలమంతా విధుల్లోకి వెళతాం. ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని కోరామన్నారు. సమస్యలపై లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామన్నారు.