గోవాలో కూడా బీజేపీని గద్దె దింపుతాం: శివసేన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవాలో కూడా బీజేపీని గద్దె దింపుతాం: శివసేన

  • కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్నాం
  • గోవా తర్వాత ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తాం
  • దేశ వ్యాప్తంగా బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేస్తాం
రానున్న రోజుల్లో గోవాలో అద్భుతం జరగబోతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యత్నిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సహా వివిధ పార్టీలతో కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. గోవా తర్వాత ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని... దేశ వ్యాప్తంగా బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా గోవాపైనే ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై తన వద్ద సమాచారం లేదని... అందుకే ఈ విషయంపై స్పందించలేదని చెప్పారు.

Shivsena
BJP
Goa

More Telugu News