ఇల్లు, ఉద్యోగం తప్ప తమ బిడ్డకు మరో వ్యాపకం లేదని ప్రియాంక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: మంత్రి సబిత
- వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సజీవదహనం
- అత్యాచారం చేసి ఆపై తగులబెట్టిన దుండగులు
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన
ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి సబిత మీడియాతో మాట్లాడుతూ, నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఇల్లు, ఉద్యోగం తప్ప మరో వ్యాపకం లేని తమ బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కన్నుమూయడం పట్ల ప్రియాంక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.
కాగా, మంత్రి సబిత తమ నివాసానికి వచ్చిన సమయంలోనూ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ప్రియాంక రెడ్డి చనిపోయిన తీరు వారిని తీవ్రంగా కలచివేస్తోంది.