కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి 'సాక్షి'లో ఈ వీడియో చూడలేదనుకుంటా: విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి 'సాక్షి'లో ఈ వీడియో చూడలేదనుకుంటా: విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • తెనాలి నుండి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చారు
  • చెప్పులు వేయించి అడ్డంగా దొరికిపోయాడు జగన్
  • ఆ వీడియో వైరల్ అవుతుంది
'టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బతుకంతా డబ్బుతో మేనేజ్ చేయడమే' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'తెనాలి నుండి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి, చెప్పులు వేయించి సాక్షి ఛానల్ లో అడ్డంగా దొరికిపోయాడు జగన్. ఆ వీడియో వైరల్ అవుతుంది. పాపం! విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాల్లో కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి ఆ వీడియో చూడలేదనుకుంటా' అని ట్వీట్ చేశారు.
 
జగన్ బతుకంతా సాక్షి గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యడమేనని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అదే పద్ధతిలో ఉన్న అమరావతిని గ్రాఫిక్స్ అంటూ భ్రమ కల్పించబోయి బొక్క బోర్లా పడ్డారని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులు స్వయంగా సాక్షిలోనే 'తెనాలి నుండి తీసుకొచ్చారు' అని చెప్పడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక జగన్ గారు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.


YSRCP
Telugudesam
budda venkanna

More Telugu News