తమిళనాడులో భారీ వర్షాలు.. మూడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

  • తమిళనాడును కుమ్మేస్తున్న భారీ వర్షాలు
  • కాంచీపురం, వెల్లూరు, చెంగల్పట్ జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
  • మద్రాస్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
భారీ వర్షాల కారణంగా తమిళనాడులో మూడు జిల్లాల్లోని పాఠశాలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో కాంచీపురం, వెల్లూరు, చెంగల్పట్ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. అలాగే,  మద్రాస్ యూనివర్శిటీలో నేడు జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.

ఇక, తిరువల్లూర్ విశ్వవిద్యాలయం సర్కడు, కాట్పడిలో నిన్న జరగాల్సిన పరీక్షలను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గత 24 గంటల్లో మీనంబక్కంలో 45 మిల్లీమీటర్లు, నుంగంబక్కంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Go Back to Shorts
Tamil Nadu
heavy rains
schools

More Telugu News