బీజేపీలో చేరిన నటుడు, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీలో చేరిన నటుడు, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్

  • కౌశల్ భార్య నీలిమ కూడా..
  • కండువాలు కప్పి ఆహ్వానించిన జేపీ నడ్డా
  • బీజేపీలో చేరిన రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి
ప్రముఖ నటుడు, బిగ్‌బాస్-2 విజేత కౌశల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. భార్య నీలిమతో కలిసి ఢిల్లీ చేరుకున్న కౌశల్.. పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి, కౌశల్ భార్య నీలిమ కూడా బీజేపీలో చేరారు.
kaushal
BJP
Bigg Boss
JP Nadda

More Telugu News