Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన మార్ఫింగ్ ఫొటోను పోస్టు చేసిన ట్రంప్.. విస్తుపోతున్న జనం!

  • రాకీ-3  సినిమాలోని హీరో ఫొటోను వాడుకున్న ట్రంప్
  • హీరో తల తీసి తన తలను అతికించిన వైనం
  • రష్యాకు హెచ్చరిక అంటున్న నెటిజన్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటో వైరల్ అవుతోంది. హాలీవుడ్ సినిమా ‘రాకీ’లో ప్రముఖ నటుడు సిల్వస్టర్ స్టాలోన్.. బాక్సర్ రాకీ పాత్రలో నటించాడు. చేతికి గ్లోవ్స్ ధరించి రింగులో నిల్చున్న స్టాలోన్ ఫొటోను జాగ్రత్తగా క్రాప్ చేసిన ట్రంప్.. స్టాలోన్ తల స్థానంలో తన తలను తగిలించారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది చూసిన జనం విస్తుపోతున్నారు. నిజంగా మన ట్రంపే! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫొటోపై నెటజిన్లు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇటీవల ట్రంప్ గుండెపోటుకు గురైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఖండించాలన్న ఉద్దేశంతో, తానెంత ఆరోగ్యంగా, బలంగా ఉన్నానో చెప్పేందుకే ట్రంప్ ఈ ఫొటోను విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, మరోవైపు ఈ ఫొటోతో రష్యాకు హెచ్చరికలు జారీ చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. రాకీ-3 సినిమాలో రష్యాకు చెందిన విలన్‌ను హీరో మట్టికరిపిస్తాడు. కాబట్టి ఈ ఫొటోతో ట్రంప్ ఆ హెచ్చరిక కూడా చేసి ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు.
Donald Trump
america
Russia

More Telugu News