ఇన్నాళ్ల ఫ్రాంచైజీ క్రికెట్ జీవితంలో నేను తెలుసుకున్నది ఇదీ!: క్రిస్ గేల్ ఆవేదన
- ఇటీవల విఫలమవుతున్న గేల్
- ఎంఝాన్సీ క్రికెట్ గేల్ జట్టు ఓటమి
- తనను జట్టుకు భారంగా చూస్తున్నారంటూ విచారం
తాను మూడ్నాలుగు మ్యాచ్ ల్లో విఫలమైతే చాలు, జట్టుకు భారంగా భావిస్తున్నారని వెల్లడించాడు. ఈ జట్టు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా తాను ఆడుతున్న లీగ్ ల్లో ప్రతి చోట అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపాడు. కొంతకాలంగా తన ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ ను విశ్లేషిస్తే వెల్లడైన వాస్తవం ఇదని పేర్కొన్నాడు. కొన్ని మ్యాచ్ ల్లో విఫలం అయితే తనకు కనీస గౌరవం ఇవ్వడంలేదని వాపోయాడు. తన గత రికార్డులను ఎవరూ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశాడు.