సీఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదు: ఉద్ధవ్ థాకరే
సీఎం అవుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై విశ్వాసముంచిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజంతా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందన్నారు. రాష్ట్రంలోని రైతుల కన్నీళ్లను తుడిచేందుకు తాము కృషిచేస్తామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామన్నారు.