Nora Fatehi: 'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ

Nora Fatehi Faces Fatwa KD Song Banned
షార్ట్స్‌లో చూడండి
కన్నడ చిత్రం ‘కేడీ: ద డెవిల్’లోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ అనే ప్రత్యేక గీతం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలో నటించిన బాలీవుడ్ నటి నోరా ఫతేహీపై అలీగఢ్‌కు చెందిన ‘దారుల్ ఇఫ్తా’ అనే ముస్లిం మతపరమైన సంస్థ ఫత్వా జారీ చేసింది. మరోవైపు వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పాటపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ధ్రువీకరించారు.

ఈ పాటలోని సాహిత్యం ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా ఉందని, ఇటువంటి ప్రదర్శనలు సమాజంలోకి తప్పుడు సందేశాన్ని పంపుతాయని దారుల్ ఇఫ్తా సంస్థ తన ఫత్వాలో పేర్కొంది. ముఖ్యంగా ముస్లిం యువతను ఈ పాట తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వివాదంపై నటి నోరా ఫతేహీ స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. మూడేళ్ల క్రితం ఈ పాటలో నటించేందుకు అంగీకరించానని, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం, అలాగే ఇది ‘నాయక్ నహి ఖల్ నాయక్ హూ మై’ వంటి ఐకానిక్ పాటకు రీమేక్ కావడంతోనే ఒప్పుకున్నానని తెలిపారు. తనకు కన్నడ భాష రాదని, అప్పట్లో చిత్రబృందం చెప్పిన అనువాదం అభ్యంతరకరంగా అనిపించలేదని ఆమె స్పష్టం చేశారు.

ఫత్వా అంటే ఏమిటి?.. చట్టబద్ధత ఎంత? 
ఇస్లామిక్ పండితులు ఏదైనా ఒక అంశంపై ఇచ్చే అభిప్రాయం లేదా మతపరమైన తీర్పునే 'ఫత్వా' అంటారు. అయితే, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఫత్వాలకు ఎలాంటి చట్టపరమైన గుర్తింపు లేదు. ఫత్వా జారీ చేసినంత మాత్రాన పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేరు. అలాగ్ న్యాయస్థానాలు దానిని ఆధారంగా తీసుకోవు. ఇది కేవలం ఒక మతపరమైన అభిప్రాయం మాత్రమే. ఇక్కడ భారత రాజ్యాంగం, దేశ చట్టాలే అత్యున్నతమైనవి. ధ్రువ సర్జా హీరోగా, ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేడీ: ద డెవిల్' చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Nora Fatehi
KD The Devil
KD Song Ban
Darul Ifta
Fatwa
Kannada Movie
Ashwini Vaishnaw
Islamic Teachings
Dhruva Sarja
Prem

More Telugu News