ఆ మాట అంటున్నారుగా, మీపై వున్న స్టేలన్నీ వెకేట్ చేయించుకోండి: చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ మాట అంటున్నారుగా, మీపై వున్న స్టేలన్నీ వెకేట్ చేయించుకోండి: చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి సవాల్

  • చంద్రబాబు 26 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు
  • వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారని బాబు అంటారా?
  • చంద్రబాబుకు తనపై తనకు నమ్మకం వుంటే ‘స్టే’లు ఎందుకు?
చంద్రబాబు మాట్లాడుతున్న భాషపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘మాతో పెట్టుకున్న వారు మటాష్’ అయిపోతారు’ అని బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ‘నాతో పెట్టుకుంటే నువ్వు మటాష్’ అయిపోతావన్నాడు. మరుసటిరోజు, రాజశేఖరెడ్డి గారు కనుమరుగయ్యారు’ అని అన్నారు. దీనిపై విచారణ జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు మళ్లీ అవే మాదిరి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం వుందని చెప్పుకుంటున్న చంద్రబాబు నోటి వెంట వచ్చేవి ఇలాంటి మాటలా? అని ధ్వజమెత్తారు.

‘నాపై ఆరోపణలు చేశారు. వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు’ అని దాదాపు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు మాట్లాడతారా? అని విమర్శించారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు ఇంకెవరూ వుండరంటూ నాడు ‘తెహల్కా’లో కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. ‘నువ్వు వెంట్రుక కూడా పట్టుకోలేరంటున్నావుగా, ఛాలెంజ్ చేస్తున్నా.. నీపై నీకు నమ్మకం వుంటే  ‘స్టే’కు ఎందుకెళ్లావు? స్టేలు అన్నీ వెకేట్ చేయించుకో. విచారణకు సిద్ధపడు’ అని సవాల్ విసిరారు.
Telugudesam
Chandrababu
YSRCP
srikanth reddy

More Telugu News