అత్యాచారం, హత్య... అమెరికాలో బలైపోయిన హైదరాబాద్ అమ్మాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యాచారం, హత్య... అమెరికాలో బలైపోయిన హైదరాబాద్ అమ్మాయి!

  • యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో చదువుతున్న యువతి
  • వర్శిటీ గ్యారేజ్ లో విగతజీవిగా కనిపించిన వైనం
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాను చదువుతున్న యూనివర్శిటీ ప్రాంగణం వెనుక వైపున ఉన్న గ్యారేజ్ లో కారు వెనుక సీటులో హైదరాబాద్ కు చెందిన ఇండో అమెరికన్‌ విద్యార్ధిని (19) విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అమెరికాలోని ఇల్లినాయిస్ లో స్థిరపడగా, వారి కుమార్తె, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో ఆనర్స్‌ విద్యార్థిని.

ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా భావిస్తున్న పోలీసులు, నిందితుడిగా భావిస్తున్న డొనాల్డ్‌ తుర్మన్‌ (26) అనే యువకుడిని చికాగోలో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించడం లేదని వర్శిటీ పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌ లను పరిశీలించి, డొనాల్డ్‌ దుశ్చర్యను పసిగట్టారు.

డాక్టర్ వృత్తిని అభ్యసించి, ఎంతో మందికి వైద్యం చేయాలని భావించిన తమ విద్యార్థిని, ఇలా విగతజీవిగా కనిపించడం ఎంతో బాధాకరమని, ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్‌ మైఖేల్‌ డీ అమిరిడిస్‌ తెలిపారు. ఆమె మరణానికి సంతాపంగా, ఆమెకు ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను మిగతా విద్యార్థినీ విద్యార్థులు క్యాంపస్‌ అంతటా ఎగురవేసి సంతాపం తెలిపారు.
USA
Hyderabad
Indo American
University of Illinois

More Telugu News