పవన్ కల్యాణ్ పాటకి డ్యాన్స్ ఇరగదీసిన సీఎం రమేశ్.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ పాటకి డ్యాన్స్ ఇరగదీసిన సీఎం రమేశ్.. వీడియో ఇదిగో!

  • సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో పూజ నిశ్చితార్థం
  • దుబాయ్ లో అట్టహాసంగా నిశ్చితార్థ కార్యక్రమం
  • భార్యతో కలసి స్టెప్పులేసిన సీఎం రమేశ్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజ నిశ్చితార్థం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరి కోసం 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని 'అమ్మో... బాపుగారి బొమ్మో' పాటకు అదిరిపోయే రేంజ్ లో వీరు స్టెప్పులేశారు. వీడియో చూడండి.
CM Ramesh
BJP
Dance

More Telugu News