సికింద్రాబాద్ లో ఆగివున్న కారులో భారీగా బంగారం పట్టివేత
- కారులో 40 బంగారు బిస్కెట్లు
- మార్కెట్లో వాటి విలువ రూ.1.95 కోట్లు
- మరో రూ.2 కోట్ల నగదు స్వాధీనం
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మరో రెండు కోట్ల రూపాయల నగదు కూడా బయటపడింది. విదేశాల నుంచి కోల్ కతాకు బంగారం తీసుకువచ్చి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు.