సొంతంగా ఏదైనా సాధించి డప్పుకొట్టుకోండి, అత్యంత గౌరవనీయ జగన్ గారూ!: నారా లోకేశ్

  • ఏపీ సీఎంపై లోకేశ్ విమర్శలు
  • చంద్రబాబు కష్టానికి వైసీపీ రంగులేస్తున్నారని మండిపాటు
  • జగన్ దంతా బిల్డప్ అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, కంపెనీలు వైఎస్ జగన్ ను చూసి  వెనక్కి వెళ్లిపోతున్నాయని, దాంతో చేసేదేమీ లేక చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమలనే తమ ఘనతగా చెప్పుకుంటూ, తామే వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చామని జగన్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారని టీడీపీ నేత లోకేశ్ ఏకిపారేశారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్ గారికి ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయనుకోవడం అత్యాశేనని వ్యాఖ్యానించారు.

'వీర' వాహన సంస్థని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఎంతో కష్టపడితే, అది కూడా వైసీపీ ప్రభుత్వ ఘనత కిందే పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాయితీలు ఇచ్చి, భూకేటాయింపులు చేసి తీసుకువచ్చిన సంస్థకు వైసీపీ రంగులేసుకుంటున్నారని ఆరోపించారు. సొంతంగా ఏదైనా సాధించి డప్పుకొట్టుకోండి అత్యంత గౌరవనీయ జగన్ గారూ! అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News