చారిత్రాత్మక డేనైట్ టెస్టు మ్యాచ్‌ చూసేందుకు కోల్ కతా చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చారిత్రాత్మక డేనైట్ టెస్టు మ్యాచ్‌ చూసేందుకు కోల్ కతా చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా

  • కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం 
  • అభినవ్‌ బింద్రా, మేరీకోమ్,  పీవీ సింధు హాజరయ్యే అవకాశం
  • సందడి చేయనున్న టీమిండియా మాజీ క్రికెటర్లు
భారత్-బంగ్లాదేశ్ మధ్య  కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా చేరుకున్నారు. ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె ఈడెన్ గార్డెన్స్ చేరుకున్నారు.

ఈ మ్యాచ్ చూసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రానున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ మ్యాచ్ ప్రారంభానికి వచ్చే అవకాశం ఉంది. ఈడెన్‌ గార్డెన్‌లో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు.

పశ్చిమ బెంగాల్ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) ప్రధాని మోదీని కూడా ఈ మ్యాచ్ కు ఆహ్వానించింది. రాజకీయ ప్రముఖులతో పాటు  షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ మేరీకోమ్, షట్లర్‌ పీవీ సింధు కూడా హాజరుకానున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.
Bangladesh
Sheikh Hasina
Kolkata
Airport

More Telugu News