ప్రియుడి వక్రబుద్ధి.. అరెస్ట్ చేయించిన ప్రియురాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడి వక్రబుద్ధి.. అరెస్ట్ చేయించిన ప్రియురాలు!

  • నాలుగేళ్లుగా యువతిని ప్రేమించిన యువకుడు
  • ఈ నెల 10న మరో యువతితో వివాహం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ యువతిని ప్రేమించి, వివాహానికి పెద్దలను ఒప్పించిన వరుడు, తన వక్ర బుద్ధిని చూపించి, అది వికటించడంతో పెళ్లికి ఒక రోజు ముందు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఇక్కడి లక్ష్మీ నరసింహ నగర్ లో ఉంటున్న ఓ యువతి (24), అక్కడికి దగ్గర్లోనే ఉండే వెంకట దుర్గా ప్రసాద్, గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెద్దలకు చెప్పి, వారిని వివాహానికి ఒప్పించారు.

వీరిద్దరికీ శుక్రవారం నాడు వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు కూడా. ఇంతలో వెంకట దుర్గా ప్రసాద్ కు 10వ తేదీన మరో యువతితో వివాహం జరిగిందని చెబుతూ, కొన్ని ఫొటోలు వధువుకు వచ్చాయి. దీంతో అవాక్కైన ఆమె, వాటిని పంపింది దుర్గా ప్రసాదేనని తెలుసుకుని షాక్ నకు గురైంది. తనను ప్రేమ పేరుతో లొంగదీసుకుని, కట్నం తీసుకోవడమే కాకుండా, మరో పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు, గురువారం నాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Police
Lovers
Marriage
Arrest
Hyderabad

More Telugu News