నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు.. సచ్చింది లేదు: కేశినేని నానిపై పీవీపీ ఫైర్
- ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి
- సాక్షి మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా అంటూ కేశినేని నాని ఎద్దేవా
- ఆ పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకోమన్న పీవీపీ
దీనికి కొనసాగింపుగా... కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలో చట్టాలు చేసేవారిలో నీవు కూడా ఒకడివని... ఆ పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో అని వ్యాఖ్యానించారు. ఎలాగూ నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు, సచ్చింది లేదని ఎద్దేవా చేశారు. 'కావాలంటే తాను ఇంగ్లీషులో రాసిపెడతా నిశానీ దొరగారూ' అంటూ ట్వీట్ చేశారు.