తమ దేశంలోకి అక్రమంగా వచ్చారని... భారతీయుల కాళ్లూ చేతులూ కట్టేసి డిపోర్ట్ చేసిన అమెరికా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమ దేశంలోకి అక్రమంగా వచ్చారని... భారతీయుల కాళ్లూ చేతులూ కట్టేసి డిపోర్ట్ చేసిన అమెరికా!

  • యూఎస్ లోకి అక్రమంగా 145 మంది ఇండియన్స్
  • ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపేసిన అమెరికా
  • నిర్దయగా వ్యవహరించారన్న బాధితులు
తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ, కాళ్లూ, చేతులు కట్టేసి మరీ తమను డిపోర్ట్ చేశారని 145 మంది ఇండియన్స్ వాపోయారు. భారత అధికారుల నుంచి తాత్కాలిక పత్రాలను పొందిన అమెరికన్ ఎంబసీ అధికారులు, వాటిని యూఎస్ కు పంపడంతో వలసదారుల శిబిరంలో నిర్బంధంలో ఉన్న వీరందరికీ విముక్తి లభించింది. అందరినీ ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించారు. తామంతా ఈక్వెడార్‌, దక్షిణ అమెరికా దేశాల్లోని ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించి యూఎస్ లోకి వెళ్లామని వెల్లడించిన బాధితులు, తమను అమెరికా అధికారులు పట్టుకుని నిర్బంధించారని తెలిపారు. అధికారులు తమ పట్ల నిర్దయగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు.
USA
India
Deport

More Telugu News