ప్రియురాలిని సంతోషపెట్టేందుకు తల్లి నగలు, నగదు కాజేసిన యువకుడు
- హైదరాబాద్ బోరబండలో ఘటన
- 8 తులాల ఆభరణాలు, రూ. 50 వేలు చోరీ
- కుమారుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు
ఇంట్లోని నగదు, నగలు కనిపించకుండా పోవడంతో ఆందోళనలో ఉన్న తల్లి లక్ష్మి కుమారుడి ప్రవర్తనలో తేడాను గుర్తించింది. అవి మాయం కావడం వెనక అరుణ్ హస్తముందని నిర్ధారించుకున్న తర్వాత ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.