మోకాలు రక్తసిక్తం.... అయినా, ఆసుపత్రిలోనూ తొడగొట్టిన శిఖర్ ధావన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోకాలు రక్తసిక్తం.... అయినా, ఆసుపత్రిలోనూ తొడగొట్టిన శిఖర్ ధావన్!

  • ఆటలో గాయపడిన ధావన్
  • ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రి సిబ్బందితో ఫొటోలు
టీమిండియాలో గబ్బర్ సింగ్ గా పేరుగాంచిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ పోటీల్లో ఆడుతున్న ధావన్ మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయం కారణంగా మోకాలు నుంచి రక్తం కారుతున్నా గబ్బర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ తన ట్రేడ్ మార్క్ చూపిస్తూ హుషారుగా తొడగొట్టాడు. అంతేకాదు, ఆసుపత్రి సిబ్బందితో ఫొటోలు కూడా దిగాడు. ఏ ఫొటోలోనూ ముఖంపై చిరునవ్వు చెదరనివ్వలేదు.

ఈ ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన ధావన్ "మనం పడుతుంటాం లేస్తుంటాం, కొన్నిసార్లు దెబ్బతింటాం, మళ్లీ కోలుకుంటాం. అయితే, వివిధ పరిస్థితులపై ఎలా స్పందిస్తామన్న విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సానుకూల దృక్పథంతో హ్యాపీగా ఉంటాను. మరో నాలుగైదు రోజుల్లో మైదానంలో అడుగుపెడతాను" అంటూ ట్వీట్ చేశాడు.
Sikhar Dhawan
Cricket
Team India

More Telugu News