రజనీకాంత్, కమలహాసన్ లు కలిస్తే... ఎలుక, పిల్లీ కలిసినట్లే!: అన్నాడీఎంకే ఎద్దేవా
- కమల్ హేతువాది, కమ్యూనిజంపై మాట్లాడతారు
- రజనీకాంత్ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి
- వీరిద్దరి కలయిక.. పరస్పర వ్యతిరేక భావాల కలయికే..
‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధినేతగా కమలహాసన్ కొనసాగుతూ హేతువాదం, కమ్యూనిజం అంశాలపై మాట్లాడుతుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు ప్రస్తావిస్తున్నారని తెలిపింది. కాగా, రజనీకాంత్ 2021 ఎన్నికల ముందు పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
‘ఆధ్యాత్మిక రాజకీయాల గురించే మాట్లాడే రజనీకాంత్, హేతువాదం కమ్యూనిజంపై మాత్రమే మాట్లాడే కమల్ తో కలిసి పనిచేస్తామనడం పిల్లి, ఎలుక కలిసి జీవించడంలా ఉంటుంది. కమల్ తో కలిసి పనిచేయడం మూలంగా రజనీకాంత్ కు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలుగదు. కాలమే రజనీకి పాఠం చెపుతుంది’ అని పేర్కొంది.