శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు రూపొందించాలి: సుప్రీంకోర్టు
- జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని ఉత్తర్వులు
- ఆలయాలన్నింటినీ ఒకే చట్టం కిందకు తీసుకురావడం సరి కాదు
- శబరిమల ఆలయాన్ని ప్రత్యేకంగా చూడాలని సూచన
ఈ సందర్బంగా, వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని ఆలయాలను కలిపి ఒకే చట్టం కిందకు తీసుకురావడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయాన్ని ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. భక్తుల సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.