హీరో నాని ఇల్లు, ఆఫీస్ పై ఐటీ దాడులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో నాని ఇల్లు, ఆఫీస్ పై ఐటీ దాడులు

  • టాలీవుడ్ ప్రముఖులు టార్గెట్ గా ఐటీ దాడులు
  • రామానాయుడు స్టూడియోస్ లో కూడా సోదాలు
  • ఐటీ దాడులతో షాక్ కు గురైన టాలీవుడ్
టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హీరో నానిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని నాని నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Nani
IT
Raids
tollywood

More Telugu News