నన్ను నేను తెరపై తొలిసారిగా చూసుకున్నప్పుడు అలా అనిపించింది: 'సప్తపది' హీరోయిన్ సబిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను నేను తెరపై తొలిసారిగా చూసుకున్నప్పుడు అలా అనిపించింది: 'సప్తపది' హీరోయిన్ సబిత

  • 'సప్తపది' చేయడం నా అదృష్టం 
  • మా వాళ్లంతా బాగా చేశావన్నారు
  • కాలేజ్ లో నన్ను చూడటానికి ఆసక్తిని చూపేవారన్న సబిత
దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఆణిముత్యాలు వంటి చిత్రాలలో 'సప్తపది' ఒకటి. ఈ సినిమా ద్వారా ఆయన సబితను కథానాయికగా పరిచయం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'సప్తపది' కోసం నేను ఎంపిక అవుతానని అనుకోలేదు. అదృష్టం కొద్దీ నాకు ఆ సినిమాలో అవకాశం లభించింది. తొలి సినిమాలోనే ఎంతోమంది సీనియర్ నటీనటులతో కలిసి నటించే అవకాశం లభించింది.

తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఫలానా సీన్ ఇంకా బాగా చేయవలసిందని అనుకుంటూ వుండేదానిని. సినిమా చూసిన మా వాళ్లంతా చాలా బాగా చేశావని అన్నారు. ఇక ఆ సినిమా చేసేవరకూ మా కాలేజ్ లో నన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ సినిమా విడుదలైన తరువాత నేను కాలేజ్ కి వెళితే, లెక్చరర్స్ కూడా వచ్చి నాతో మాట్లాడేవారు. నన్ను చూడటానికి మిగతా స్టూడెంట్స్ ఆసక్తిని చూపించేవారు" అని చెప్పుకొచ్చారు.
Sabita

More Telugu News