నేడు స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర

  • అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల
  • హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 78.96
  • హైదరాబాద్ లో లీటరు డీజిల్‌ ధర 71.85  
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికమవడంతో వరుసగా ఆరో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. అలాగే, ఈ రోజు డీజిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, చెన్నైలో 16 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్‌ ధర 71.85 గా ఉంది.

విజయవాడలో పెట్రోలు ధర రూ.78.17, డీజిల్‌ ధర 70.81గా ఉంది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్‌ ధర 65.84, కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్‌ ధర 68.25, చెన్నైలో పెట్రోలు ధర రూ. 77.13, డీజిల్‌ ధర 69.59, ముంబయిలో పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్‌ ధర 69.06గా ఉన్నాయి.
petrol
New Delhi

More Telugu News