భర్తకు గుండెపోటు.. అతడి కంటే ముందే చనిపోవాలని భార్య ఆత్మహత్య
- హైదరాబాద్ రహమత్‌నగర్‌లో ఘటన
- భర్తకు గుండెపోటు రావడంతో తీవ్ర మనస్తాపం
- ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం
తల్లి రత్నాదేవికి ఫోన్ చేసి భర్తకంటే ముందు తానే చనిపోతానని ఏడ్చింది. దీంతో ధైర్యం చెప్పిన తల్లి.. అలాంటి పిచ్చిపనులు చేయొద్దని, అంతా కుదుటపడుతుందని నచ్చజెప్పింది. అయినప్పటికీ ఆందోళన నుంచి బయటపడని సింధూజ ఈ నెల 14న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సింధూజ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.