సీఎం జగన్ ను కలిసిన గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ఇటీవలి ఎన్నికల్లో వల్లభనేని వంశీపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడదే వంశీ వైసీపీలోకి వస్తుండడంతో తన భవిష్యత్ ఏంటని యార్లగడ్డ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తగిన భరోసా కోసమే ఆయన ఇవాళ సీఎం జగన్ ను కలిసి మాట్లాడినట్టు అర్థమవుతోంది. అంతకుముందు, యార్లగడ్డతో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని చర్చలు జరిపారు. ఆపై మంత్రులిద్దరితో కలిసి యార్లగడ్డ సీఎం జగన్ వద్దకు వెళ్లారు. జగన్ తో భేటీ అనంతరం యార్లగడ్డ, కొడాలి నాని, పేర్ని నాని ముగ్గురూ ఒకే కారులో వెళ్లిపోయారు.