టీఎస్సార్టీసీ జేఏసీ నేతల దీక్ష విరమణ
- వైద్యుల సూచన మేరకు దీక్ష విరమింపజేసిన అఖిలపక్ష నేతలు
- నిమ్మరసం ఇచ్చిన మంద కృష్ణ మాదిగ
- సమ్మెపై తుది నిర్ణయాన్ని రేపు సాయంత్రం ప్రకటిస్తామన్న అశ్వత్థామరెడ్డి
అంతకుముందు, ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న ఆర్టీసీ జేఏసీ నాయకులను అఖిలపక్షం నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో చర్చలు జరపాలని కోరారు. టీటీడీపీ నేత ఎల్. రమణ, వామపక్ష నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరంచేయాలని చూస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను బజారుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.