'అసురన్' రీమేక్ కోసం వెంకీని కలిసిన 'బ్రహ్మోత్సవం' దర్శకుడు?

  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • వెంకీ హీరోగా తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • తెరపైకి హను రాఘవపూడి - అజయ్ భూపతి పేర్లు 
తమిళంలో ధనుశ్ కథానాయకుడిగా వచ్చిన 'అసురన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సురేశ్ బాబు రంగంలోకి దిగాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఏ దర్శకుడికి అప్పగించాలా అనే తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఎక్కువగా హను రాఘవపూడి .. అజయ్ భూపతి పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ తో వున్న సాన్నిహిత్యం కారణంగా ఆయనను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసినట్టుగా సమాచారం. కుటుంబ నేపథ్యంలో సాగే కథలను .. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే 'బ్రహ్మోత్సవం' పరాజయం నుంచి ఆయన మరో అవకాశాన్ని అందుకోవడం కష్టమవుతోంది. ఈ కారణంగానే ఆయన వెంకటేశ్ ను కలిసి 'అసురన్' సినిమాను గురించి మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. మరి వెంకటేశ్ .. సురేశ్ బాబుకి సిఫార్స్ చేస్తారో లేదో చూడాలి.
Go Back to Shorts
Venkatesh
Srikanth Addala

More Telugu News