అయ్యప్ప భక్తుల వెనకే శునకం.. ఇప్పటికే వందల కి.మీ దూరం వెళ్లిన వైనం

  • తిరుమల నుంచి శబరిమలకు బయలుదేరిన కొందరు అయ్యప్ప భక్తులు 
  • గత నెల 31 నుంచి శబరిమలకు కాలినడకన యాత్ర ప్రారంభం
  • వారి వెంట 480 కిలోమీటర్లు నడిచిన శునకం
తిరుమల నుంచి కొందరు అయ్యప్ప భక్తులు గత నెల 31 నుంచి శబరిమలకు కాలినడకన బయలుదేరగా, వారిని అనుసరిస్తూ ఓ శునకం కూడా వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. కొంత దూరం తమతో వచ్చి ఆ శునకం వెళ్లిపోతుందని అయ్యప్ప భక్తులు అనుకున్నారు. అయితే, అది ఏకంగా 480 కిలోమీటర్లు తమ వెంట రావడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగేహర వద్ద వారి యాత్ర కొనసాగుతోంది.

తన వెంటే ఆ శునకం 480 కిలోమీటర్లు వచ్చిందని, దీంతో దానికి కూడా ఆహారాన్ని పెడుతున్నామని అయ్యప్ప భక్తులు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. తాము ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన వెళ్తామని, ఇలా శునకం తమ వెంటే రావడం ఇదే తొలిసారని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది.
Go Back to Shorts
dog
Kerala
Karnataka
sabarimala

More Telugu News