మారబోతున్న ఆగ్రా నగరం పేరు.. సాక్ష్యాల కోసం చరిత్రను తవ్వితీస్తున్న అంబేద్కర్ వర్సిటీ
- ఉత్తరప్రదేశ్లో పేరు మార్చుకోనున్న మరో నగరం
- అగ్రవాన్గా మార్చాలని నిర్ణయం
- మహాభారత కాలంలో ఆగ్రాను అగ్రవాన్గా పిలిచేవారన్న ప్రొఫెసర్ ఆనంద్
ఇందులో భాగంగా చరిత్రను తవ్వి తీస్తోంది. ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. ఆగ్రాకు తొలుత అగ్రవాన్ అనే పేరు ఉండేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహాభారత కాలంలో ఈ నగరాన్ని అగ్రవాన్, అగ్రబాణ్గా పిలిచేవారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు ప్రొఫెసర్ ఆనంద్ తెలిపారు.