ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లోకి దూసుకొచ్చిన షమీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లోకి దూసుకొచ్చిన షమీ

  • షమీకి తాజా ర్యాంకుల్లో 7వ స్థానం
  • ఒక్కసారిగా 8 స్థానాలు ఎగబాకిన షమీ
  • బ్యాటింగ్ ర్యాంకుల్లో కోహ్లీకి రెండోస్థానం
ఇటీవల నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్ మెన్ కు అగ్నిపరీక్ష పెడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఒక్కసారిగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో షమీ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. గత కొన్నినెలలుగా షమీ అంత నిలకడగా బౌలింగ్ చేస్తున్న ప్రపంచస్థాయి బౌలర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. స్పిన్ కు అనుకూలించే భారత పిచ్ లపైనా షమీ చెలరేగుతున్న తీరు క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా నెంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు ఏమాత్రం తెలియడంలేదంటే అది నిస్సందేహంగా షమీ చలవే.

ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్ లో ఆస్ట్రేలియా యువ పేసర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రబాడా, జాసన్ హోల్డర్ ఉన్నారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్ కు దూరమైన బుమ్రా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు పదో స్థానం దక్కింది.

ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. పుజారా 4, రహానే 5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా టెస్టు జట్టు ఓపెనర్ గా ప్రమోషన్ దక్కించుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 10వ ర్యాంకు అందుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్థానం నిలుపుకున్నాడు.
ICC
Mohammad Shami
Rankings
Bowlers
Team India

More Telugu News