మరీ ఇంతలా మేకప్ వేసుకోవాలా? రేణూ మోండల్ ఫొటోలు వైరల్.. విమర్శల జల్లు
Add ap7am to your home Screen

మరీ ఇంతలా మేకప్ వేసుకోవాలా? రేణూ మోండల్ ఫొటోలు వైరల్.. విమర్శల జల్లు

  • రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకునే స్థాయి నుంచి బాలీవుడ్‌ గాయనిగా మోండల్
  • పలు కార్యక్రమాల్లో పాల్గొంటోన్న గాయని
  • ఓవర్ మేకప్ వేసుకుందని నెటిజన్లు సెటైర్లు
రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకునే స్థాయి నుంచి బాలీవుడ్‌ గాయనిగా ఎదిగారు రేణూ మోండల్. ప్రతిభ అంటే ఏంటో చాటి చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌ లో  'ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై' అనే పాట పాడగా.... ఆమె స్వరాన్ని విన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. ఆమె పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.

అయితే, ఆమె తాజాగా తన ముఖానికి వేసుకున్న మేకప్ కారణంగా విమర్శల పాలవుతున్నారు. ఆమె మేకప్ స్థాయి కాస్త అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఆమెకు సంబంధించిన పలు పొటోలు బయటకు వచ్చాయి. మరీ ఇంతలా మేకప్ వేసుకోవడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ మేకప్ వేసుకున్న ఆమెపై పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.

Bollywood
viral photos
renu mondal

More Telugu News