ఆర్ కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ గుడ్ బై
- అదే బాటలో ఇతర డైరెక్టర్లు
- ఇప్పటికే రాజీనామా చేసిన సీఎఫ్ వో, డైరెక్టర్ మణికంఠన్ వి
- దివాలా తీసి విక్రయానికి సిద్ధంగా ఉన్న ఆర్ కామ్
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కామ్ డైరెక్టర్ అనిల్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఆయనతోపాటు డైరెక్టర్లుగా ఉన్న చాయా విరాని, రైనా కరాణి, మంజరి కాకెర్, సురేశ్ రంగాచారి కూడా రాజీనామాలు చేశారు. కాగా కంపెనీ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మణికంఠన్ ఇప్పటికే రాజీనామా చేశారు.