రూ.50,921 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న వొడాఫోన్ ఐడియా
- సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలు
- ఆదాయంలో మాత్రం 42 శాతం పెరుగుదల
- గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,874 కోట్ల నష్టాలు
సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వానికి వొడాపోన్ ఐడియా రూ.44,150 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంతో కలుపుకునే తాజా నష్టాన్ని ప్రకటించింది. కాగా, ఏజీఆర్‌పై ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లనున్నట్టు వొడాఫోన్ తెలిపింది. కాగా, టెలికం చరిత్రలో ఈ స్థాయిలో నష్టాలు రావడం ఇదే తొలిసారి.