బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ మ్యాచ్: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి
- భారత్ తొలి ఇన్నింగ్స్ 86/1
- బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్
- బంగ్లా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించిన భారత సీమర్లు
అంతకు ముందు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత సీమర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తలవంచారు. 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటయ్యారు. మొమినుల్ హక్ (37 పరుగులు), ముష్ఫికర్ రహీం (43 పరుగులు), లిటన్ దాస్ (21 పరుగులు) మాత్రమే భారత బౌలింగ్ ను కొంచెం ప్రతిఘటించగలిగారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3/27, ఉమేష్ యాదవ్ 2/27, ఇశాంత్ శర్మ 2/20, రవిచంద్రన్ అశ్విన్ 2/43 వికెట్లు తీశారు.