Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పద్ధతిగల అమ్మాయి పాత్రలనే చేస్తాను: 'తోలుబొమ్మలాట' హీరోయిన్ హర్షిత చౌదరి

  • తెలుగు తెరకి మరో కొత్త హీరోయిన్ 
  • 'తోలుబొమ్మలాట'తో పరిచయం 
  • తన స్వభావానికి తగిన పాత్రలే చేస్తానన్న హర్షిత
'తోలుబొమ్మలాట' సినిమా ద్వారా తెలుగు తెరకి మరో కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది .. ఆ అమ్మాయి పేరే ' హర్షిత చౌదరి'. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో హర్షిత మాట్లాడుతూ .. "హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్ర ఫ్యామిలీ మాది. నేను చేసిన కొన్ని యాడ్స్ కారణంగా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో నేను ఇన్నోసెంట్ గా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటించాను. నా పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ హీరోతో కలిసి నటించడం ఆనందంగా వుంది. ఇకపై కూడా నటిస్తాను .. అయితే పద్ధతిగల పాత్రలను మాత్రమే చేస్తాను. డ్రెస్సింగ్ అనేది నాకు కంఫర్ట్ గా ఉండాలి .. రొమాంటిక్ సీన్స్ చేయవలసి వస్తే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మంచి పాత్రలను చేయడానికి సిద్ధమే .. నా స్వభావానికి తగని పాత్రలను మాత్రం చేయకూడదనే నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చింది.
Harshita

More Telugu News