దీపక్ చాహర్ గురించి తొమ్మిదేళ్ల క్రితం ఆకాశ్ చోప్రా ట్వీట్.. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు జరిగింది!
- చాలా ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశానని ఆకాశ్ ట్వీట్
- దీపక్ చాహర్ పేరును గుర్తు పెట్టుకోండి
- భవిష్యత్ లో అతడి ఆటతీరును గురించి మీరంతా చర్చించుకుంటారు
అప్పట్లో ఆయన దీపక్ చాహర్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'చాలా ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశాను. అతడు రాజస్థాన్ కు చెందిన దీపక్.. దీపక్ చాహర్ పేరును గుర్తు పెట్టుకోండి. భవిష్యత్ లో అతడి ఆటతీరును గురించి మీరంతా చర్చించుకుంటారు' అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు దీపక్ చాహర్ గురించి క్రికెట్ అభిమానులంతా చర్చించుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే ఆకాశ్ వేసిన అంచనాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.