కర్నూలు జిల్లాలో విషాదం.. పాఠశాలలో సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి
- విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
- మధ్యాహ్న భోజనం కోసం క్యూలో నిల్చున్న విద్యార్థి
- వెనక నుంచి నెట్టివేయడంతో సాంబారు గిన్నెలో పడిన వైనం
వెంటనే అప్రమత్తమైన స్కూలు యాజమాన్యం చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే విద్యార్థి శరీరంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు నిన్న రాత్రి పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.