బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్ సమాధానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్ సమాధానం!

  • యామీ గౌతమ్‌ నటించి చిత్రం ‘బాలా’కు మంచి స్పందన 
  • ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ 
  • బట్టతల ఉన్న వ్యక్తిని ఎందుకు చేసుకోకూడదు? అని వ్యాఖ్య
  • బట్టతల ఉన్నవారు శాంతస్వరూపులన్న హీరోయిన్
బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, భూమి పడ్నేకర్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘బాలా’కు మంచి స్పందన వస్తోంది. ఈ నెల  7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించారు. ఇందులో హీరోకు భార్యగా యామీ గౌతమ్‌ నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు నిజ జీవితంలోనూ బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ ‘ఎందుకు చేసుకోకూడదు’ అని సమాధానం ఇచ్చింది.

'నిజానికి బట్టతల ఉన్నప్పటికీ ఇటువంటి వారు చాలా శాంతస్వరూపులు. బట్టతల ఉన్న వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలి. మా సినిమాలోని  ఉద్దేశం కూడా ఇదే' అని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగాత్మక చిత్రానికి ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.
bala
Bollywood

More Telugu News